జీవో 2 నుంచి అడెక్వసీ పదాన్ని తొలగించాలి..డైరెక్టరేట్ ముందు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ధర్నా

జీవో 2 నుంచి అడెక్వసీ పదాన్ని తొలగించాలి..డైరెక్టరేట్ ముందు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ధర్నా

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ టీచర్లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ 2లోని అడెక్వసీ అనే పదాన్ని తొలగించాలని కోరుతూ టీచర్లు ఆందోళనకు దిగారు. మంగళవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ కొంగల వెంకట్ నేతృత్వంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ... ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 2తో ఎస్సీ, ఎస్టీ సీనియర్ టీచర్లకు అన్యాయం జరుగుతుందని, ఆ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. 

ప్రమోషన్లలో ఓపెన్ సీనియార్టీని పరిగణనలోకి తీసుకొని, దాని ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. దీంతో పాటు రోస్టర్ ద్వారా ఎస్సీలకు15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ లింగయ్యను కలిసి వినతిపత్రం అందించారు.