రిమోట్ ఆపరేటింగ్  తో  పత్తి కాంటాల్లో మోసాలు

రిమోట్ ఆపరేటింగ్  తో  పత్తి కాంటాల్లో మోసాలు

ఆదిలాబాద్ జిల్లా: సిరికొండ మండలం సాత్ మోరి గ్రామంలో పత్తి దళారుల దోపిడీ బయటపడింది. రిమోట్ ఆపరేటింగ్  తో  పత్తి కాంటాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఓ వ్యాపారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కొట్టారు పత్తి రైతులు. ఇంటి వద్దే పత్తిని కొనుగోలు చేస్తామంటూ వచ్చి.. పత్తిని తూకం వేసే  సమయంలో.. కాంటాలను రిమోట్ తో ఆపరేట్ చేస్తున్న వ్యవహారాన్ని అన్నదాతలు గుర్తించారు. క్వింటాల్  పత్తికి ఏకంగా 30 నుంచి 40 కిలోలు కోత పెట్టారని గుర్తించారు రైతులు.

తూకాల్లో మోసంపై వ్యాపారిని సాత్  మోరి గ్రామస్తులు నిలదీశారు. బండారం బయటపడగా నిజం ఒప్పుకుని డబ్బులు చెల్లిస్తానంటూ కాళ్ల బేరానికి వచ్చాడు వ్యాపారి. తూకంలో కొట్టేసిన పత్తికి.. ధర చెల్లిస్తానని తిరిగి రైతులకు అప్పగించాడు. ఇలా ఎన్ని గ్రామాల్లో ఎంతమంది రైతులను మోసం చేశాడో తేల్చాలని రైతులు డిమాండ్  చేస్తున్నారు. వ్యాపారిపై కేసు నమోదు చేసి.. మోసపోయిన రైతులందరికీ న్యాయం చేయాలంటున్నారు. 

మరిన్ని వార్తల కోసం

 

కేసీఆర్ కు కొత్త నిర్వచనం చెప్పిన విజయశాంతి

బెంగాల్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు