
హైదరాబాద్: మరికొన్ని గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురుసే ఛాన్స్ఉందని వాతావరణ శాఖ అంచాన వేసింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలకు పడతాయని హెచ్చరించింది.
జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాలలోని చాలాచోట్లు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిస్తాయని ఆరెంజ్ అలెర్ట్ తో హెచ్చరించింది.
ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి - కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్‌లలో సాయంత్రం -అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేసింది.
మరోవైపు హైదరాబాద్ తో సహా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం చాలా వేడగా, తేమతో కూడిన వాతావరణ ఉంటుందని ఐఎండీ తెలిపింది.
సెప్టెంబర్ 9 నుంచి హైదరాబాద్‌తో సహా మొత్తం తెలంగాణలో శక్తివంతమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ శాఖ.