
రాష్ట్ర అవతరణ వేడుకలకు షెడ్యూల్ ను ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. జూన్ 2వ తేదీన జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. ఉత్సవాలను పరేడ్ గ్రౌండ్స్ లో కాకుండా.. పబ్లిక్ గ్రౌండ్ లోని జూబిలీ హాల్ కు ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించాలని అధికారులకు తెలిపారు కేసీఆర్. ఎండలు ఎక్కువగా ఉన్నందున పొద్దున 9గంటల నుంచి 10.30 మధ్య ఉత్సవాలను నిర్వహించాలని ఆదేశించారు. మొదట అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. 9 గంటలకు పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం జరుగుతాయి. 11 గంటలకు జూబిలీ హాలులో రాష్ట్రావతరణ అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది.