అక్టోబర్ 1న తెలంగాణలో మోదీ టూర్ 4 గంటలే

 అక్టోబర్ 1న తెలంగాణలో మోదీ టూర్  4 గంటలే
  • సాయంత్రం 5:10 గంటలకు తిరిగి ఢిల్లీకి 
  • మొదట హైదరాబాద్​లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • తర్వాత మహబూబ్ నగర్ బహిరంగ సభకు హాజరు 

హైదరాబాద్, వెలుగు:  ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. ఆయన కేవలం 4 గంటలే రాష్ట్రంలో ఉంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు హైదరాబాద్ చేరుకుని, తిరిగి సాయంత్రం 5:10 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు. మొదట హైదరాబాద్ లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ కేవలం అరగంట మాత్రమే ఉంటారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ వెళ్లి సభలో గంటపాటు ఉంటారు. అయితే షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర నేతలతో భేటీకి ఎలాంటి సమయం కేటాయించలేదు. 

ఇదీ షెడ్యూల్.. 

మోదీ వచ్చే నెల 1న ఉదయం 11: 20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 2:15 గంటల వరకు హైదరాబాద్ లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2:25 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 3:05 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3:15 గంటల నుంచి 4:15 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5:05 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:10 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7:20 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.