ఫోన్ కోసం అక్కాతమ్ముడి గొడవ.. ఉరేసుకొని చనిపోయిన తమ్ముడు

ఫోన్ కోసం అక్కాతమ్ముడి గొడవ.. ఉరేసుకొని చనిపోయిన తమ్ముడు

ఫోన్ కోసం అక్కతో గొడవపడి..తమ్ముడు ఉరేసుకొని చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కరోనావైరస్ ప్రభావంతో స్కూళ్లన్నీ మూతపడ్డాయి. దాంతో ఇంటి దగ్గరే ఉంటున్న చిన్నారులు ఆటలు ఆడుతుండగా.. మరికొంతమంది మాత్రం ఫోన్లకు బాగా అలవాటుపడిపోయారు. అలా ఫోన్ కోసం గొడవపడిన బాలుడు.. ఫోన్ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.

చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, ధోర్ణ కంబాలకు చెందిన సుమతి, రాజు దంపతులకు ముని విద్య, ముని తేజ అనే ఇద్దరు సంతానం. పిల్లలిద్దరూ సెల్ ఫోన్ కోసం గొడవపడ్డారు. దాంతో తండ్రి రాజు.. మునితేజను మందలించాడు. నాన్న తిట్టాడనే కోపంతో తేజ.. బెడ్ రూమ్‌లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తేజ ఎంతసేపటికీ రూమ్ నుండి బయటకు రాకపోవడంతో తండ్రి రాజు గడ్డపారతో తలుపు పగులగొట్టి చూశాడు. అపస్మారక స్థితిలో ఉన్న తేజను 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే తేజ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తేజ మృతదేహాన్ని చూసి అతని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

ఈజీగా కొత్త అప్పులిస్తున్నస్టేట్​ బ్యాంక్​

ఈ నెల నుంచి కొత్త కరెంట్ బిల్లులు

కారు కొనాలనుకుంటున్నారా? ఇదే మంచి సమయం..