డివైడర్ ను ఢీ కొట్టిన స్కూల్ వ్యాన్: ముగ్గురు పిల్లలు మృతి

డివైడర్ ను ఢీ కొట్టిన స్కూల్ వ్యాన్: ముగ్గురు పిల్లలు మృతి

వేములవాడలో వాగేశ్వరి స్కూల్ వ్యాన్ ప్రమాదంలో మృతుల సంఖ్య ముగ్గురికి పెరిగింది. స్కూల్ నుంచి హాస్టల్ కు వెళ్తుండగా స్కూల్ బస్ డివైడర్ ను ఢికొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో పదో తరగతి చదువుతున్న చందనారాణి, 2వ తరగతి చదువుతున్న దీక్షిత అక్కడికక్కడే చనపోయారు. 2వ తరగతి చదువుతున్న మరో బాలుడు రిసిత్.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు.

వాగేశ్వరి స్కూల్ వేములవాడలో ఉంటే.. హాస్టల్ చింతలఠానాలో ఉంటుంది. రోజూ విద్యార్ధులను భోజనం కోసం స్కూల్ నుంచి హాస్టల్ కు తీసుకెళ్తుంటారు. ఇవాళ కూడా అలానే వెళ్తుంటే ప్రమాదం జరిగింది. అయితే స్కూల్ హాస్టల్ కు పర్మీషన్ లేదని తెలుస్తోంది. స్కూల్ ను కూడా ఫోర్త్ ఫ్లోర్ లో నడుపుతున్నారని స్థానియకులు చెబుతున్నారు.

ఘటనపై స్కూల్ కు వెళ్లి విచారణ చేశారు డీఈవో. హాస్టల్ కు పర్మిషన్ లేదని చెప్పారు. స్కూల్ పర్మిషన్  రద్దు కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు తెలిపారు డీఈవో

మరోవైపు ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలు తెలుసుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు. విద్యార్ధులు చనిపోవడం బాధాకరమన్న ఈటల…గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.