
ముంభైలో హృదయాల్ని కలిచివేసే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరు చిన్నారులు రోడ్డుపై వెళ్తుండగా మూలమలుపు తిరుగుతున్న ఓ స్కూల్ బస్సు వారిని తొక్కుకుంటూ వెళ్తింది. ఈ యాక్సిడెంట్ ముంభై పక్కనున్న వసాయ్ లో శుక్రవారం మధ్యాహ్నం జరింగింది. సెయింట్ అగస్టిన్ హైస్కూల్‌కు చెందిన బస్సు డ్రైవర్ రోడ్డు దాటుతున్న ఇద్దరు పిల్లల్ని చూడకుండా నెమ్మదిగా వచ్చి వారిపైకి ఎక్కించాడు. ఇద్దరు పిల్లలూ ఎవరి సహాయం లేకుండా రోడ్ క్రాస్ చేస్తున్నారు.
(नोट -: दृश्य विचलित कर सकते हैं) pic.twitter.com/8i1BlKLS95
— SANJAY TRIPATHI (@sanjayjourno) March 2, 2024
బస్సు ముందు టైర్ వారిపై నుంచి వెళ్లిన తర్వాత అప్పుడు డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సు ఆపి డ్రైవర్ పరార్ అయ్యాడు. బస్సు కిందపడిన అమ్మాయికి 4- ఏళ్లు, అబ్బాయికి 2- ఏళ్లు ఉంటాయి. గాయపడిన వారిద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యాలు ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.