విద్యార్ధులకు సంతోషకరమైన వార్త.. సెలవులొస్తే చాలు విద్యార్థులకు పండగే.. ఆటలు ఆడొచ్చు.. సరదాగా ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టొచ్చు. పేరెంట్స్ తో కలిసి బయటికి వెళ్లొచ్చు.. ఇలా చాలా రకాల ఈవెంట్స్ ఉంటాయి. అందుకే స్టూడెంట్స్ సెలవులు రాగానే కేరింతలు కొడతారు. అక్టోబర్ ముగిసింది.. ఇప్పుడు నవంబర్ వచ్చేసింది.. అక్టోబర్ అంతకాకపోయినా నవంబర్ లో కూడా స్కూళ్లకు బాగానే సెలవులు వచ్చాయి. తెలంగాణలో స్కూళ్లకు ఏయే రోజు సెలవులు ఉన్నాయో అవేంటో చూద్దాం..
నవంబర్ నెలలో ఆదివారాలతో కలిపి మొత్తం 8 రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చాయి. అక్టోబర్ లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా అక్టోబర్‌లో చాలా రోజులు సెలవులు వచ్చాయి. అయితే నవంబర్‌లో ముఖ్యమైన హిందుపండుగలు ఉన్నాయి. దసరా, దీపావళి తర్వాత ముఖ్యమైన హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం వస్తుంది.. అందులో కార్తీక పూర్ణిమ సందర్బంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. తర్వాత జవహర్ లాల్ నెహ్రు పుట్టిన రోజు బాలల దినోత్సవం సందర్బంగా కూడా స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.
నవంబర్ హాలిడేస్ లిస్ట్ ఇదే..
- ఆదివారం –నవంబర్ 2
- కార్తీక పూర్ణిమ – నవంబర్ 5
- రెండవ శనివారం - నవంబర్ 8
- ఆదివారం- నవంబర్ 9
- బాలల దినోత్సవం - నవంబర్ 14
- ఆదివారం- నవంబర్ 16
- ఆదివారం- నవంబర్ 23
- ఆదివారం- నవంబర్ 30
