School Holidays : డిసెంబర్‌ నెలలో స్కూల్స్‌కు 9 రోజులు సెల‌వులు

School Holidays  :  డిసెంబర్‌ నెలలో స్కూల్స్‌కు 9 రోజులు సెల‌వులు

విద్యార్థులకు గుడ్ న్యూస్..  నవంబర్ నెలలో హాలీడేస్ తో ఎంజాయ్ చేసిన విద్యార్థులకు డిసెంబర్ లో కూడా బాగానే హాలీడేస్ రానున్నాయి.   డిసెంబర్‌ నెలలో 9 రోజులు స్కూల్స్ మూతపడనున్నాయి.   డిసెంబర్ లో  మొత్తం  ఐదు ఆదివారలు వస్తున్నాయి.  ఎలాగూ  రెండు, నాలుగో శనివారం స్కూల్స్  కు సెలవులు ఉంటాయి.  వీటితో స్కూల్స్ కు మొత్తం 7 రోజులు సెలవులు రానున్నాయి.  

అలాగే ఇదే నెలలో అతిపెద్ద పండగ  క్రిస్మస్ పండగ  కూడా  వస్తుంది.   డిసెంబర్‌ 23 నుంచి 30వ తేదీ వరకు సెలవులు ఉంటాయి. (క్రిస్మస్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి).  మిగిలిన‌ స్కూల్స్‌కు క్రిస్మస్, బాక్సింగ్ డే  సందర్భంగా రెండు రోజులు పాటు (డిసెంబ‌ర్ 25, 26వ తేదీన‌) సెల‌వులు ఇస్తారు. 

దీంతో స్కూల్స్‌కు డిసెంబ‌ర్ 24వ తేదీ(ఆదివారం), 25వ తేదీ(క్రిస్మస్), 26వ తేదీల్లో(బాక్సింగ్ డే) సంద‌ర్భంగా మూడు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి.