బడిపిల్లలకు ఎంజాయి చేసే టైమొచ్చింది. తెలంగాణలో ఎంతో భక్తితో ఉత్సాహంగా.. జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలు అక్టోబర్ 2 న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 2 నుండి దసరా సెలవులను అధికారికంగా ప్రకటించింది. 13 రోజులు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. అక్టోబర్ 2న గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 14 వరకు సెలవులు ఉండగా అక్టోబర్ 15న స్కూళ్లు పునః ప్రారంభంకాను న్నాయి. అక్టోబర్ 2నుంచి వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి సొంత గ్రామాలకు వెళ్ళనున్నారు. మే 25న తెలంగాణ ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా.. 13 రోజులు సెలవులను ప్రకటించింది.
అటు ప్రైవేట్ స్కూళ్లు కూడా పేరెంట్స్‌కు సెలవుల గురించి సమాచారం ఇస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతు న్నారు.. తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో మంగళవారం ( అక్టోబర్ 1 ) బతుకమ్మ సెలబ్రేషన్స్ జరపనున్నట్టు యాజమా న్యాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కూడ దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 03 నుండి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు ప్రకటించింది. అన్ని విద్యా సంస్థలు సెలువులు ఇవ్వాలని ఆదేశించింది