ఒక్క ట్రిక్ తో కోటీశ్వరురాలైన స్కూల్ టీచర్.. ఇంతకీ ఏం చేసిందబ్బా

ఒక్క ట్రిక్ తో కోటీశ్వరురాలైన స్కూల్ టీచర్.. ఇంతకీ ఏం చేసిందబ్బా

అదృష్టం ఎవరికి ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. అదే గనక వస్తే.. పైసా లేని బీదవాడు క్షణాల్లో కోటీశ్వరుడవుతాడు.. కాటికి కాలు చాపిన వారు సాఫీగా లేచి నవ్వుతూ తిరుగుతారు. అలాంటి అదృష్టమే ఓ టీచర్ కు దక్కింది. పేద కుటుంబం నుంచి వచ్చిన ఈమె.. పేరు పక్కన డిగ్రీలు ఉన్నా.. తగిన సమయంలో సరైన ఉద్యోగ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో చేసేదేం లేక డబ్బు కోసం ఓ ప్రైవేటు స్కూల్లో పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. తక్కువ డబ్బు వచ్చినా.. వాటితోనే కాలం వెల్లదీసేది. అప్పుడే ఆమె మదిలో ఓ ట్రిక్ మెదిలింది. వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. కోట్లాది రూపాయలు సంపాదించడం ప్రారంభించింది. ఇంతకీ ఆమె మదిలో మెదిలిన ఆ ట్రిక్ ఏంటీ.. ఏం చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.

చైనాలోని వుహాన్ నగరానికి చెందిన కిండర్ గార్టెన్ అనే టీచర్.. కొన్ని రోజుల క్రితం తాను నర్సరీ పిల్లలకు బోధిస్తున్న దృశ్యాలను వీడియో తీసి, దాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఈ వీడియోకు ఊహించని రీతిలో తక్కువ సమయంలోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో తాను యూట్యూబ్ వీడియోస్ చేసి, యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనుకుంది. ఇలా స్కూల్లోనే చేస్తూ ఉంటే పెద్ద మొత్తం సంపాదించలేనని ఆలోచించి తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది.

రూ. 2 కోట్ల 36 లక్షలకు పైగా సంపాదిస్తూ...

ఆమె షేర్ చేసిన వీడియోలు ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో కిండర్ర్.. నర్సరీ రైమ్స్ ను చైనీస్‌లో పాడటం చూడవచ్చు. ఈ వీడియోకు 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంటే దాదాపు 10 కోట్లకు పైనే. ఆమె బోధనా విధానం చాలా ప్రత్యేకంగా ఉండడంతో ప్రజలు ఆమె వీడియోలను ఇష్టపడుతున్నారు. పిల్లలు ఆమె మాటలను ఎంతో ఆప్యాయంగా వింటూ, మధ్యలో వేసే జోకులకు నవ్వుతూ ఎంజాయ్ చేస్తు్నారు. ఈ వీడియోకు గానూ ఆమె 71వేల డాలర్లు సంపాదించింది. ఈ టీచర్ ఇటీవలే టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మహిళ కేవలం 3 లైవ్ స్ట్రీమ్‌ల ద్వారా ఇప్పటివరకు 2 మిలియన్ యువాన్లకు పైగా అంటే దాదాపు రూ. 2 కోట్ల 36 లక్షలు సంపాదించింది.

చైనీస్ సోషల్ మీడియా డౌయిన్‌లో ఈ టీచర్‌కు 40 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారని మలేషియా న్యూస్ పోర్టల్ తెలిపింది. కొద్ది నెలల్లోనే చాలా మంది సబ్ స్రైబర్లను సొంతం చేసుకున్న ఈ టీచర్ .. ఇలా ఆమె బోధనను ప్రత్యక్ష ప్రసారం చేయమని కొంతమంది అనుచరులు సూచించారని తెలుస్తోంది. తాను ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని, రోజూ ఒక లైవ్ స్ట్రీమింగ్ చేస్తానని ఆ టీచర్ చెబుతున్నారు.

https://youtu.be/ZwMV0DhFR5A