స్కూల్ వాట్సాప్ గ్రూప్‌: క్లాస్‌ అమ్మాయిల్ని రేప్ చేద్దామంటూ సెలబ్రెటీల పిల్లలు చాట్

స్కూల్ వాట్సాప్ గ్రూప్‌: క్లాస్‌ అమ్మాయిల్ని రేప్ చేద్దామంటూ సెలబ్రెటీల పిల్లలు చాట్

వాళ్లంతా ముంబైలో పలు రంగాల్లో సెలబ్రెటీల పిల్లలు. వయసు 13-14 ఏళ్ల మధ్య ఉంటుంది. ఓ టాప్ ఇంటర్నేషనల్  స్కూల్‌లో చదువుకుంటున్నారు.  ఆడామగా అన్న బేధం లేకుండా చదువుతో పాటు ఆటపాటల్లో కలిసిపోవాల్సిన ప్రాయం అది. కానీ, ఆ పసి వయసులోనే క్లాసులోని అమ్మాయిల్ని ఏ విధంగా రేప్ చేద్దామనే దానిపై స్కెచ్‌లు వేశారు. ఆడపిల్లల్ని చెత్తతో పోలుస్తూ.. శరీరాకృతులపై వల్గర్ కామెంట్లు చేశారు. పైశాచికంగా బూతులు తిడుతూ క్లాస్ మేట్స్‌ భయానికి గురి చేశారు.

ఈ భయానక, సిగ్గు చేటు ఘటనకు పాల్పడిన ఎనిమిది మంది సెలబ్రెటీల పిల్లల్ని ఆ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. వాళ్లు ఈ పని చేసింది నేరుగా కామెంట్లు చేయడం ద్వారా కాదు. క్లాస్‌లో పిల్లల కోఆర్డినేషన్ కోసం పెట్టుకున్న వాట్సాప్ గ్రూప్‌లో (ఆడ పిల్లలు కూడా ఉన్నారు) చాటింగ్ చేశారు. కొంత మంది అమ్మాయిల పేర్లు గ్రూప్‌లో పెట్టి వాళ్లంతా ఓ నైట్‌ తమతో రావాలంటూ అభ్యకరమైన భాషలో కామెంట్లు చేశారు ఆ 8 మంది విద్యార్థులు. ఆ తర్వాత ఎక్కువగా ఇద్దరు అమ్మాయిల గురించే చాటింగ్ సాగింది. గ్యాంగ్ బ్యాంగ్, రేప్ వంటి పదాలతో పాటు బూతులు తిడుతున్న మెసేజ్‌లతో చాట్ నిండిపోయింది. కొంతమంది పిల్లల్ని స్వలింగ సంపర్కులంటూ గే, లెస్బియన్ లాంటి పదాలు కూడా వాడారు వీళ్లు. అలాగే ఓ కుర్రాడిని టార్గెట్ చేస్తూ వాళ్ల తండ్రి రోజూ రేప్ చేస్తాడంటూ అసభ్యంగా మాట్లాడారు. ఓ అమ్మాయిని రేప్ చేసి చంపుతానంటూ కూడా వాళ్లలో ఒకడు ఆ గ్రూప్‌లో మెసేజ్ పెట్టాడు.

ఎలా బయటికొచ్చింది?

ఈ స్కూల్ పిల్లల వాట్సాప్ గ్రూప్ చాట్‌ను ఓ ఇద్దరు అమ్మాయిల తల్లులు చెక్ చేయడంతో ఇది బయటికొచ్చింది. ఆ చాటింగ్ స్క్రీన్ షాట్స్ తీసి పేరెంట్స్ గ్రూప్‌లో పెట్టడంతో విషయం అందరికీ తెలిసింది. దీనిపై పేరెంట్స్ అంతా కలిసి స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ఆ 8 మంది పిల్లల్ని సస్పెండ్ చేసినట్లు తెలిపింది. అయితే వాళ్లంతా మైనర్లు కావడంతో చట్టానికి లోబడి మీడియా ఆ పిల్లలు, వారి పేరెంట్స్ పేర్లు బయట పెట్టకూడదు.

భయపడిపోయిన అమ్మాయిలు

అయితే వాస్తవానికి ఈ చాటింగ్ నవంబరు 8 నుంచి 30వ తేదీ మధ్య జరిగిందని ఓ పేరెంట్ తెలిపారు.  ఈ విషయం ముందే బయటపడాల్సింది. కానీ, వాళ్లు సెలబ్రెటీల పిల్లలు కావడంతో స్కూల్‌లో కానీ తల్లిదండ్రులతో కానీ చెప్పే ధైర్యం చేయలేదు మిగిలిన విద్యార్థులు. అయితే కొంతమంది అమ్మాయిలు ఆ వాట్సాప్ మెసేజ్‌ల తీరుతో భయపడిపోయి కొద్ది రోజులుగా తాము స్కూల్‌కు వెళ్లబోమంటూ ఏడుస్తున్నారని, ఒకరిద్దరు స్కూల్‌కు వెళ్లడం లేదని, అడిగితే కారణం చెప్పడం లేదని పేరెంట్స్ చెప్పారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

MORE NEWS:

ఎలాగో చస్తాం.. మళ్లీ ఉరి శిక్షెందుకు: సుప్రీంలో నిర్భయ దోషి వింత పిటిషన్

రేప్‌లు జరగొద్దంటే..  మగవాళ్లు ఇలా చేయాలి

ఎక్కడ లోపం?

టీనేజ్.. పిల్లలు మంచి దారిలో వెళ్లాలన్నా, పెడదోవ పట్టాలన్నా ఈ వయసులోనే. 13 నుంచి 18 ఏళ్లు పూర్తయ్యేలోపే భవిష్యత్తుకు ఓ బాట పడుతుంది. ఈ వయసులోనే పైశాచిక ఆలోచనలు బుర్రలో చేరితే వాళ్లు పెద్దయ్యాక ఏమవుతారు? ముంబైలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన ఘటన సమాజం మొత్తానికి ఈ ప్రశ్న వేస్తోంది. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్స్ చేతికివ్వడమా? పోర్నోగ్రఫీ ప్రభావమా? లేక పేరెంటింగ్ లోపమా? అని సమాజాన్ని తానే నిగ్గదీసి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టెక్నాలజీని పిల్లలకు అందుబాటులో ఉంచడం తప్పు కాదు. కానీ వాళ్లు ఏం చేస్తున్నారన్నది ఓ కంట కనిపెట్టడం అవసరం. తోటి పిల్లలతో ఎలా మెలగాలన్నది నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

More News
అదే తరహాలో 9 హత్యలు చేసిన దిశ నిందితులు?
సీఎం కేసీఆర్ ఏడాది పాలనపై ప్రజా తీర్పు !!
తన నకిలీ ఫేస్‌బుక్ పేజీపై స్పందించిన ఐఏఎస్