చదువులతల్లి ఒడికి..స్కూల్స్కు మామిడితోరణాలు... రంగు కాగితాలతో అలంకరణ

చదువులతల్లి ఒడికి..స్కూల్స్కు మామిడితోరణాలు... రంగు కాగితాలతో అలంకరణ

వెలుగు, నెట్​వర్క్​: వేసవి సెలవులు ముగియడంతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సోమవారం పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. మొదటిరోజు సందర్భంగా స్కూల్స్​ను మామిడి తోరణాలు, రంగు కాగితాలతో అలంకరించారు. పలుచోట్ల పెయింటింగ్స్​ వేసి, ఆకట్టు కునేలా సిద్ధం చేశారు. పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు టీచర్లు బొకేలు, ఫ్లవర్స్, బ్యాండ్​ మేళాలతో ​ఘన స్వాగతం పలికారు.

 ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రేక్​ఫాస్ట్​ స్కీమ్​ను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కాగా, పలుచోట్ల విద్యార్థులను పాఠశాలలకు పంపించాలని ఉపాధ్యాయులు స్టూడెంట్స్​ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు సర్కారు బడి ప్రాముఖ్యత గురించి వివరించారు. పాఠశాలలో కొత్తగా చేరిన వారికి అడ్మిషన్లు అందజేశారు. విద్యాశాఖ ఆఫీసర్లు ఆయా పాఠశాలలను తనిఖీ చేసి, ఏర్పాట్లు, సౌకర్యాలను పరిశీలించారు.

 అశ్వారావుపేట మండలంలోని ఆయా పాఠశాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సందర్శించి, అభివృద్ధి పనులను ప్రారంభించారు. పనులకు వెళ్లకుండా స్కూల్​కు వెళ్లాలని పిల్లలకు సూచించారు. తిరుమలకుంట స్కూల్​లో విద్యార్థికి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పార్టీ నాయకులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తొలిరోజు 1185 స్కూళ్లలో 6654 మంది స్టూడెంట్స్​హాజరైనట్లు కలెక్టర్​ అంకిత్​ తెలిపారు. ఈ ఏడాది 60 వేలకు పైగా సర్కారు బడుల్లో అబ్లికేషన్ల సంఖ్య పెంచేలా టార్గెట్​ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. చంద్రుగొండ మండలం లోని ఊటుపల్లి ప్రైమరీ స్కూల్లో 15 మంది పిల్లలకు గాను ఒకే ఒక్కరు అటెండ్ అయ్యారు.