
ఆగస్ట్ 20నుంచి పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఈ నెల 20న 6 నుంచి10వ తరగతి విద్యార్ధులకు, సెప్టెంబర్ లో ప్రైమరీ విద్యార్ధులకు డిజిటల్ క్లాసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
డిజిటల్ క్లాసులు దూరదర్శన్, టీశాట్ ద్వారా విద్యార్ధులకు క్లాసులు నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన సబితా ఇంద్రారెడ్డి.. క్లాసులకు అటెండ్ కానీ విద్యార్ధులకు యూట్యూబ్ లో పాఠాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్ధులకు సైతం డిజిటల్ క్లాస్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ ఒకటి తర్వాత ఇంటర్ అడ్మిషన్లు ఉంటున్నట్లు వెల్లడించారు.
ఎంట్రన్స్ పరీక్షలు ఎప్పటి నుంచంటే
తెలంగాణ లో డిగ్రీ అడ్మిషన్లు 20నుంచి దోస్త్ ద్వారా ప్రారంభిస్తామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి .
ఆగస్ట్ 31 – ఈ-సెట్
సెప్టెంబర్ 2 – పాలి సెట్
సెప్టెంబర్ 9,10,11,14th -ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.