సెప్టెంబర్ 5న స్కూళ్లను ప్రారంభించాలి: సీఎం జగన్

సెప్టెంబర్ 5న స్కూళ్లను ప్రారంభించాలి: సీఎం జగన్

సెప్టెంబర్ 5న స్కూళ్లను ప్రారంభించాలన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. స్కూళ్లు తెరిచే నాటికి సకల సౌకర్యాలతో పాఠశాలలు సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

నాడు-నేడు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) సీఎం జగన్ సమీక్షా సమావేశం చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాకానుక కిట్లను పరిశీలించారు.  ఆ తర్వాత మాట్లాడిన సీఎం జగన్.. సెప్టెంబర్ 5న పాఠశాలలను ప్రారంభించాలని… ఆ సమయానికి నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలని చెప్పారు. ప్రతి స్కూల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే అందమైన వాల్‌ పెయింటింగ్స్‌, బొమ్మలు వేయించి, విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్‌ ఉండాలన్నారు.

ముందుగా అనుకున్న ప్రకారమే సెప్టెంబర్‌ 5న జగనన్న విద్యాకానుక నిర్వహించనున్నట్లు తెలిపారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు.