సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌‌ ‘7:11 పి.ఎం’

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌‌  ‘7:11 పి.ఎం’

సాహస్, దీపికా ప్రధానపాత్రల్లో చైతు మాదాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్  ‘7:11 పి.ఎం’. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మిస్తున్నారు. టీజర్‌‌‌‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు.

 రెండు గ్రహాల మధ్య జరిగే కథ ఇది. మరో గ్రహానికి చెందినవాళ్లు.. భవిష్యత్తులో మానవుల మనుగడకు కీలకమైన సమాధానాల కోసం హంసలదీవి అనే టౌన్​కి చేరుకుంటారు. కానీ అదే రోజున ఆ టౌన్‌‌ని నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. హీరో తన చేతిలోని టైమర్‌‌ను రాత్రి 7:11 నిముషాల లోపు డియాక్టివేట్ చేయకపోతే కార్డియాక్ అరెస్ట్‌‌తో చనిపోతాడు. ఆ టైమ్‌‌లోపు మిస్టరీని ఎలా ఛేదించాడనేది కాన్సెప్ట్. ఇదొక సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ అని చెబుతున్నారు మేకర్స్. టెస్, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.