వెలుగులోకి వచ్చిన 48వేల 500 ఏళ్ల నాటి జాంబీ వైరస్

వెలుగులోకి వచ్చిన 48వేల 500 ఏళ్ల నాటి జాంబీ వైరస్

గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మంచు కరుగుతోంది. దీంతో వేల ఏండ్లుగా మంచులో దాగి ఉన్న వివిధ రకాల సూక్ష్మజీవులు, వైరస్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఇలాంటి వైరస్ ఒకటి బయటకి వచ్చింది. రష్యాలో గడ్డ కట్టుకుపోయిన ఓ సరస్సులో జాంబీ వైరస్ బయటపడింది. ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సైంటింస్టులు ఈ వైరస్ జాడను గుర్తించారు. యుకేచి అలాస్ సరస్సులో సైబీరియన్ తోడేలు పేగుల్లో వైరస్ను గుర్తించారు. పాండోరా ఎడోమాగా పిలుస్తున్న ఈ వైరస్కు శరవేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు.

జాంబీ వైరస్ దాదాపు 48వేల 500 ఏళ్ల కిందటదని అంచనా వేస్తున్నారు. ఈ వైరస్ ప్రబలితే ప్రపంచ జనాభా ఆరోగ్యం మొత్తం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అంటువ్యాధులకు కారణమయ్యే ఈ వైరస్..వాతావరణంలోకి అవి విడుదలైతే కలిగే ప్రమాదాలను అంచనా వేయడానికి మరింత అధ్యయనం చేయవలసి ఉందని అన్నారు. వాతావరణ వేడెక్కడం కారణంగా మిలియన్ల సంవత్సరాలుగా ఘన రూపంలో ఉన్న మంచు, దాని నుంచి సేంద్రీయ పదార్థాలు విడుదల అవుతున్నాయని అలెంపిక్ చెప్పారు. వీటిలో ఎక్కువ భాగం కార్బన్ డయాక్సైడ్, మీథేన్‌లేనని, ఇవి గ్రీన్‌ హౌస్ ప్రభావాన్ని మరింత పెంచుతాయని మేరీ అలెంపిక్ స్పష్టం చేశారు.