గాలిలో కరోనా వైరస్

గాలిలో కరోనా వైరస్

సూచనలు ఇవే.. 
   .. కరోనా సోకిన వ్యక్తులు మాట్లాడినప్పుడు, అరిచినప్పుడు, పాడినప్పుడు లేదా తుమ్మినప్పుడు వైరస్ తుంపర్ల రూపంలో గాలిలోకి చేరుతుంది. ఆ గాలిని పీల్చుకునే వాళ్లకు ఈజీగా సోకే చాన్స్ ఉంటుంది. 
  ..  ఇండ్లు, ఆఫీసుల్లో వెంటిలేషన్, ఎయిర్ ఫిల్ట్రేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. 
   .. ఇండోర్స్ లో తక్కువ మంది ఉండాలి. వీలైనంత తక్కువ టైం కలిసి పని చేయాలి. 
  ..  ఇండోర్స్ లోనూ తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలి. మాస్కులు మంచి క్వాలిటీతో, ఫిట్ గా ఉండాలి. 
  ..  కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్, సేవలు చేసే హెల్త్ కేర్ స్టాఫ్​కు హైగ్రేడ్ పీపీఈ కిట్లు ఇవ్వాలి. 
  ..  కరోనా ముప్పును తప్పించుకోవాలంటే నేలపై, వస్తువులపై పడే డ్రాప్లెట్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. 
  ..  చేతులు బాగా కడుక్కోవాలి. వస్తువులు, ప్రదేశాలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌  చేయాలి. 

కరోనా మహమ్మారి గాలి ద్వారానే చాలా తీవ్రంగా వ్యాపిస్తోందట. వస్తువులను ముట్టుకోవడం కంటే.. వైరస్ తో ఉన్న గాలిని పీల్చుకోవడం వల్లే పెద్ద మొత్తంలో వైరస్ కణాలు ఒకరి నుంచి ఒకరికి చేరుతున్నాయట. అందుకే..  కరోనాను గాలి ద్వారా వ్యాపించే (ఎయిర్ బోర్న్) వైరస్ గా ప్రకటించాలని బ్రిటన్, అమెరికా, కెనడా సైంటిస్టులు తేల్చిచెప్తున్నారు. గాలి ద్వారానే కరోనా తీవ్రంగా వ్యాపిస్తోందని చెప్పేందుకు గట్టి ఆధారాలు కూడా ఉన్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. వెంటనే గాలి ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో), ఇతర సంస్థలకు వారు సూచనలు చేశారు. రీసెర్చ్ లో భాగంగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ట్రిష్ గ్రీన్ హాల్గ్ ఆధ్వర్యంలోని ఆరుగురు సైంటిస్టుల బృందం వైరస్ వ్యాప్తికి సంబంధించి పబ్లిష్​అయిన అనేక ఆర్టికల్స్ ను రివ్యూ చేశారు. గాలిలో ఫ్లూయిడ్స్ ఎలా ప్రయాణిస్తాయి? లైవ్ వైరస్ తీరు ఎలా ఉంటుంది? అన్నవి స్టడీ చేసిన వీరు.. గాలి ద్వారా కరోనా వ్యాప్తికి సంబంధించి ప్రధానంగా10 అంశాలను తమ స్టడీ పేపర్ లో పేర్కొన్నారు.
 
‘గాలి’ కరోనాకు ఇవే ఆధారాలు.. 

‘‘అమెరికాలోని స్కాగిట్ కౌంటీలో ఒకే వ్యక్తి నుంచి 53 మందికి కరోనా వ్యాపించింది. కానీ మొదట వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు క్లోజ్ కాంటాక్ట్ లేదు. అతను ఉపయోగించిన వస్తువులను కూడా ఇతరులు వాడలేదు. కానీ అతను ఉన్న పరిసరాల్లోనే ఉండటం వల్ల ఇతరులకు వైరస్ అంటుకున్నది. ఈ సంఘటనలోని అన్ని విషయాలను పరిశీలిస్తే.. కచ్చితంగా గాలి ద్వారానే ఇతరులకు వైరస్ వ్యాపించినట్లు స్పష్టం అవుతోంది. ఎయిర్ బోర్న్ ట్రాన్స్ మిషన్ కు ఈ సంఘటన గట్టి ఆధారం” అని సైంటిస్టులు చెప్పారు. అలాగే బయటి ప్రదేశాల కంటే ఇండోర్స్ లో, ముఖ్యంగా వెంటిలేషన్ సరిగ్గా లేని రూంలలో వైరస్ వ్యాప్తి చాలా రెట్లు ఎక్కువగా ఉందనేందుకు కూడా చాలా ఎవిడెన్స్ లు  ఉన్నాయన్నారు. ఫంక్షన్లు, పార్టీలు, ఇతర కార్యక్రమాల్లోనూ సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లుగా బయటపడిన అనేక సంఘటనల్లో కూడా కరోనా గాలి నుంచే వ్యాపించిందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చిచెప్పారు.
 
సైలెంట్ గానే 40% కేసులు

దగ్గులు, తుమ్ముల వంటి సింప్టమ్స్ లేని వ్యక్తుల నుంచి ఇతరులకు కరోనా సైలెంట్ గా వ్యాపిస్తుండటం వల్లే వైరస్ వేగంగా విస్తరిస్తోందని సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం కేసులు ఇలా సైలెంట్ ట్రాన్స్ మిషన్ ద్వారానే వస్తున్నాయని చెప్పారు. అయితే ఈ సైలెంట్ ట్రాన్స్ మిషన్ లో గాలి ద్వారా కరోనా వ్యాప్తే ఎక్కువగా ఉంటుందని, అందుకే అన్ని దేశాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయని అంచనా వేశారు.పెద్ద తుంపర్లతో వ్యాప్తి తక్కువ కరోనా పేషెంట్ల నుంచి పెద్ద తుంపర్ల ద్వారా నేలపై పడే వైరస్ ఇతరులకు వ్యాపించే చాన్స్ తక్కువని సైంటిస్టులు తెలిపారు. పెద్ద తుంపర్లు వెంటనే నేలపై, వస్తువులపై పడిపోతాయని, వాటి ద్వారా వైరస్ అంత ఈజీగా వ్యాపించే అవకాశం లేదన్నారు. 

అడ్డుకోకుంటే మరింత నష్టం 

గాలిలోని కరోనా దగ్గరలో ఉన్నవారికే కాకుండా దూరంగా ఉన్నవారికి కూడా సోకే చాన్స్ ఉందని స్టడీలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా ఏరోసాల్ సైంటిస్ట్ కిమబర్లీ ప్రాథర్ చెప్పారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనలు జరిగాయని, అందుకే కరోనాను ఎయిర్ బోర్న్ వైరస్ గా గుర్తించాల్సి ఉందన్నారు. దీనిని ఎయిర్ బోర్న్ వైరస్ గా అధికారికంగా గుర్తించి, తగిన నివారణ చర్యలు తీసుకోకుంటే విపత్తు మరింత తీవ్రం కావచ్చని పేర్కొన్నారు.