Boston Beer Crisis: దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్కాట్లాండ్ జట్టు ఫిఫా ప్రపంచకప్ 2026 మెగా టోర్నీకి క్వాలిఫై అవ్వడంతో.. ఆ దేశానికి చెందిన లక్షలాది మంది అభిమానులు (టార్టాన్ ఆర్మీ) అమెరికాలోని బోస్టన్ నగరానికి తరలివచ్చారు. గ్రూప్-సీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో స్కాట్లాండ్ 1–0తేడాతో హైతీపై గెలిచి మైదానంలో పండగ చేసుకుంటే.. బోస్టన్ నగరంలోని పబ్బులు, బార్లు మాత్రం బీర్ సంక్షోభాన్ని (Beer Crisis) ఫేస్ చేస్తున్నాయి.
ఎమర్జెన్సీ డెలివరీలతో సరిపెట్టారుగా:
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. టోర్నమెంట్ మొదటి వీకెండ్‌లోనే స్కాట్లాండ్ ఫ్యాన్స్ బోస్టన్ నగరంలోని బీర్ నిల్వలన్నింటినీ తాగేసి బార్ ఓనర్లకు చుక్కలు చూపించారు. డౌన్‌టౌన్ బోస్టన్‌లోని సామ్ ఆడమ్స్ టాప్ రూమ్ జనరల్ మేనేజర్ బిల్లీ డెకైన్ మాట్లాడుతూ.. నేను 30 ఏళ్లుగా ఈ బిజినెస్‌లో ఉన్నాను, కానీ నా లైఫ్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చాడు. కేవలం 4 రోజుల్లో 4,000కి పైగా పింట్ల బీర్ అమ్ముడైపోవడంతో 90కి పైగా బీర్ డ్రమ్ములు (Kegs) ఖాలీ అయిపోయాయి.. సడన్‌గా ఎమర్జెన్సీ డెలివరీ ట్రక్కులను తెప్పించకపోయుంటే, కస్టమర్లకు క్యాన్లు అమ్ముకోవాల్సి వచ్చేదని బార్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
బ్యాగ్‌పైప్స్ మార్చ్.. ఫిన్‌వే పార్క్‌లో రచ్చ:
ఈ సంబరాలు కేవలం పబ్బులకే పరిమితం కాలేదు.. స్కాట్లాండ్ సాంప్రదాయ సంగీత వాయిద్యం బ్యాగ్‌పైప్స్ (Bagpipes) బ్యాండ్‌లతో అభిమానులంతా బోస్టన్ వీధుల్లో భారీ ఫ్యాన్ మార్చ్ నిర్వహించారు. ఆ తర్వాత బోస్టన్ రెడ్ సాక్స్ హోమ్ గ్రౌండ్ అయిన ప్రసిద్ధ ఫిన్‌వే పార్క్ లో జరిగిన స్పెషల్ స్కాట్లాండ్ థీమ్ ఈవెంట్‌లో పాల్గొని నగరాన్ని హోరెత్తించారు.
►ALSO READ | తెలంగాణ కుర్రాడి టాలెంట్‌కు దేశం ఫిదా.. జాతీయ ఐస్ హాకీ ఛాంపియన్‌షిప్‌కు ఆర్యన్ కర్ర సెలక్ట్!
స్కాట్లాండ్ ఫ్యాన్స్ ఈజ్ ది బెస్ట్:
నగరంలో బీర్ సప్లైపై ఎంత ప్రెజర్ పడినప్పటికీ.. స్కాట్లాండ్ ఫ్యాన్స్ ప్రవర్తనకు బోస్టన్ మేయర్ మిషెల్ వు (Michelle Wu) ఫిదా అయిపోయారు. ప్రపంచంలోనే ఎక్కువ స్పోర్ట్స్ ఫ్యాన్స్ మా బోస్టన్‌లోనే ఉన్నారని అనుకునేవాళ్లం.. కానీ స్కాట్లాండ్ అభిమానుల అంకితభావాన్ని చూశాక వారిపై గౌరవం పెరిగింది.. స్కాట్లాండ్ ఫ్యాన్స్ నిజంగానే బెస్ట్.. వాళ్ళు ఇక్కడి లోకల్ బిజినెస్‌లకు ఎంతో సపోర్ట్ ఇస్తూ, బోస్టన్‌ను తమ రెండో ఇల్లుగా భావించి కలిసిపోయారని చెప్పుకొచ్చాడు.
Marching to Fenway with a few thousand fellow Scotland fans has been one of many incredible highlights from this weekend pic.twitter.com/epVunVGVKG
— ChiTownPaul 🏴🦆 (@CTPaul90) June 14, 2026
