హైదరాబాద్‌సిటీ, వెలుగు: రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. రైల్వే కార్యకలాపాల నిర్వహణ, భద్రతపై సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సమీక్ష నిర్వహించారు.
రాత్రి వేళ్లలో రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. లెవెల్ క్రాసింగ్‌లు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు వంటి కీలక అంశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పారు. రైళ్ల రాకపోకలు నిరంతరాయంగా, సురక్షితంగా సాగేందుకు భద్రతా పరికరాలు, రైలు బిగింపుల ( రైల్ ఫిట్టింగ్స్) నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జీఎం సత్యప్రకాశ్, ప్రధాన విభాగాధిపతులు పాల్గొన్నారు.
