మిస్సయిన అమ్మాయిల కోసం వెతుకుతుంటే.. ఏడు డెడ్​బాడీలు దొరికినయ్

మిస్సయిన అమ్మాయిల కోసం వెతుకుతుంటే.. ఏడు డెడ్​బాడీలు దొరికినయ్
  • అమెరికాలోని ఓక్లహోమాలో ఘటన

ఓక్లహోమ: మిస్సయిన ఇద్దరు అమ్మాయిల కోసం వెతుకుతుండగా పోలీసులకు ఏడుగురి డెడ్​బాడీలు లభ్యమయ్యాయి. అమెరికా ఓక్లహోమా సిటీకి దగ్గర్లోని హెన్రియెట్టా టౌన్​లో డెడ్​బాడీలు దొరికినట్లు స్టేట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మంగళవారం తెలిపారు. ఇద్దరు టీనేజీ అమ్మాయిలు కనిపించకుండాపోయారంటూ వాళ్ల కుటుంబ సభ్యులు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో సెర్చింగ్ మొదలు పెట్టిన పోలీసులకు ఆ ఇద్దరు అమ్మాయిల డెడ్​బాడీలతో పాటు, ఇంకో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి.


రేపిస్ట్​తో వెళ్లిన టీనేజర్లు.. 


రేప్ కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన జెస్సీ మెక్​ఫాడెన్(39) అనే వ్యక్తితో ఈ ఇద్దరు అమ్మాయిలు ఐవీ వెబ్​స్టర్(14), బ్రిటనీ బ్రూవర్(16) వెళ్లినట్లు పోలీసులు అనుమానించారు. మెక్ ఫాడెన్ సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని వాళ్లను ట్రాప్ చేశాడని గుర్తించి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. హెన్రియెట్టా టౌన్​లోనే ఈ ఇద్దరు అమ్మాయిలు మెక్​ఫాడెన్​తో కలిసి కారులో వెళ్తున్నట్లు హైవే పెట్రోలింగ్ డిపార్ట్ మెంట్ సమాచారం ఇచ్చింది. వాళ్లను గాలిస్తూ వెళ్లిన అధికారులు మెక్ ఫాడెన్ ఇంటిదగ్గర్లోనే ఏడుగురి డెడ్​బాడీలను గుర్తించారు. అందులో మూడు మృతదేహాలు వెబ్​స్టర్, బ్రూవర్, మెక్​ఫాడెన్​వని తేల్చారు. మిగతా నాలుగు డెడ్​బాడీల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ ఏడుగురు ఎలా చనిపోయారనేదానిపైనా దర్యాప్తు చేస్తున్నారు. ‘‘2003లో రేప్ కేసులో మెక్ ఫాడెన్​కు జైలు శిక్ష పడింది. అతను 2020 అక్టోబర్​లో విడుదలయ్యాడు”అని పోలీసులు తెలిపారు. బ్రిటనీ బ్రూవర్ మిస్ హెన్రియెట్టాగా ఎంపికైందని, జులైలో జరగనున్న మిస్ నేషనల్ పోటీకి వెళ్లాల్సి ఉందని ఆమె తల్లిదండ్రులు వెల్లడించారు.