అదానీ గ్రూప్​పై 2016 తర్వాత ఎలాంటి దర్యాప్తు జరపలేదు

అదానీ గ్రూప్​పై 2016 తర్వాత ఎలాంటి దర్యాప్తు జరపలేదు
  • సుప్రీం కోర్టుకు చెప్పిన సెబీ
  • ఇంతకు ముందు ఇచ్చిన వివరాలు తప్పు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్​ కంపెనీలపై 2016 తర్వాత ఎలాంటి దర్యాప్తూ జరపలేదని, ఇంతకు ముందు తాము ఇచ్చిన  వివరాలు తప్పని సెబీ సోమవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. హిండెన్​బర్గ్​ ఎపిసోడ్​పై దర్యాప్తునకు తమకు మరికొంత టైము కావాలని సుప్రీం కోర్టును సెబీ కోరింది. దర్యాప్తు వేగంగా పూర్తి చేసే క్రమంలో ఏవైనా పొరపాట్లు జరిగితే, న్యాయపరమైన చిక్కులకు దారితీయొచ్చని పేర్కొంది.

హిండెన్​బర్గ్​ రిపోర్టు కొన్ని అదానీ గ్రూప్ ​ట్రాన్సాక్షన్లపై ఆరోపణలు చేసిందని, ఆ ట్రాన్సాక్షన్లు క్లిష్టమైనవి కావడంతోపాటు,వాటికి సబ్​–ట్రాన్సాక్షన్లు కూడా ఉన్నాయని, మరోవైపు ఆ ట్రాన్సాక్షన్లన్నీ ఒకే దేశంలో జరిగినవి కావని సుప్రీం కోర్టుకు సెబీ వివరించింది. అదానీ గ్రూప్​లోని లిస్టెడ్ కంపెనీలు​ రూల్స్​ అతిక్రమించాయా?  అనే విషయంపై విదేశాలలోని 11  రెగ్యులేటరీ ఏజన్సీలను ఇప్పటికే సమాచారం అడిగామంది.

అమెరికా షార్ట్​ సెల్లర్​ హిండెన్​బర్గ్​ చాలా ఆరోపణలు చేసింది. అకౌంటింగ్ ఫ్రాడ్స్​తోపాటు, షేర్ల ధరలలోనూ మానిప్యులేషన్​ జరుగుతోందని ఆరోపించింది. ఈ అంశంలో దాఖలైన ఒక కేసులో సుప్రీం కోర్టు విచారణ మొదలెట్టింది. సోమవారం ట్రేడింగ్​లో అదానీ గ్రూప్​అన్ని షేర్లూ నష్టాలపాలయ్యాయి. అదానీ టోటల్​ గ్యాస్​ షేర్లు అత్యధికంగా 5 శాతం నష్టపోయాయి.