ఐపీఓ యాంకర్ బుక్ సైజ్ పెంపు

ఐపీఓ యాంకర్ బుక్ సైజ్ పెంపు

న్యూఢిల్లీ: ఐపీఓలలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల (మ్యూచువల్​ ఫండ్స్, ఇన్సూరెన్స్​ కంపెనీలు, పెన్షన్​ ఫండ్స్​) భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో మార్కెట్ సెబీ యాంకర్​ ఇన్వెస్టర్ల కోసం షేర్ల కేటాయింపు రూల్స్​ను సవరించింది. యాంకర్​ పోర్షన్‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ను 33 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. 

ఇందులో 33 శాతం మ్యూచువల్​ ఫండ్స్‌‌‌‌‌‌‌‌కు, మిగిలిన 7 శాతం ఇన్సూరెన్స్,​ పెన్షన్​ ఫండ్స్‌‌‌‌‌‌‌‌కు ఉంటుంది. ఏడు శాతం వాటా సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్​ కాకపోతే, దానిని మ్యూచువల్​ ఫండ్స్‌‌‌‌‌‌‌‌కు కేటాయిస్తారు. రూ. 250 కోట్లకు మించిన యాంకర్​ పోర్షన్​ ఉన్న ఐపీఓలకు  యాంకర్​ ఇన్వెస్టర్ల సంఖ్యను 10 నుంచి 15కు పెంచారు. ఈ కొత్త నిబంధనలు నవంబర్​ 30 నుంచి అమల్లోకి వస్తాయి.