ఎన్నికల ఆఫీసర్లు, సిబ్బందికి రెమ్యునరేషన్ ఫిక్స్ : మంద మకరందు పీఆర్

ఎన్నికల ఆఫీసర్లు, సిబ్బందికి  రెమ్యునరేషన్ ఫిక్స్ : మంద మకరందు పీఆర్
  • జీతభత్యాలు ఖరారు చేసిన ఎస్ఈసీ 

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన రెమ్యునరేషన్, టీఏ, డీఏల రేట్లను ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మంద మకరందు పీఆర్, ఆర్డీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సృజనకు లేఖ రాశారు. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల తరహాలోనే పంచాయతీ ఎన్నికలకు కూడా రేట్లను వర్తింపజేయాలని సూచించారు. 

ప్రీసైడింగ్ ఆఫీసర్స్, కౌంటింగ్ సూపర్ వైజర్ కు రోజుకు రూ.500, పోలింగ్ ఆఫీసర్స్ కు రోజుకు రూ. 400, కౌంటింగ్ అసిస్టెంట్ కు రోజుకు రూ.450, క్లాస్-–4 సిబ్బందికి రోజుకు రూ.350, భోజనం, లంచ్ ఖర్చులు రోజుకు రూ.500 ఇవ్వనున్నారు. సెక్టార్ ఆఫీసర్, అసిస్టెంట్ అబ్జర్వర్ కు ఎన్నికల డ్యూటీ పూర్తయ్యే వరకు రూ.10 వేలు,  మైక్రో అబ్జర్వర్ కు రూ.2వేలు, స్టాటిక్ సర్వైలెన్స్ కు రూ.3 వేలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కు రూ.2 వేలు అందించనున్నారు. 

ట్రైనింగ్ క్లాసులకు హాజరయ్యే సిబ్బంది, అలాగే ఎన్నికల విధుల్లో ఉండే పోలీసు సిబ్బందికి కూడా ఇవే రేట్లు వర్తిస్తాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని పంచాయతీ రాజ్ శాఖను ఆదేశించింది.