టీఆర్టీఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.అధ్యక్షుడిగా కటకం రమేశ్,ప్రధాన కార్యదర్శిగా మారెడ్డి అంజిరెడ్డి

టీఆర్టీఎఫ్ రాష్ట్ర  నూతన కమిటీ ఎన్నిక.అధ్యక్షుడిగా కటకం రమేశ్,ప్రధాన కార్యదర్శిగా మారెడ్డి అంజిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు కొత్త కమిటీని ఎన్నుకున్నట్టు నేతలు ప్రకటించారు. 

స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీగా బైతి ఐలయ్య, అసోసియేట్ అధ్యక్షులుగా ధరావత్ రాములు, రెంటాల రమణారెడ్డి, జి. గోవర్ధన్, నరేంద్ర నాయక్, కె. లోకేశ్వర్, మందల లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. అడిషనల్ జనరల్ సెక్రటరీలుగా జై మధుచంద్ర, అనిల్ కుమార్ రెడ్డి, టి. సతీష్ గౌడ్, బేతి సాయి కృష్ణ, నామాని శంకర్, ఎస్. భూమయ్య ఎన్నికయ్యారు. 

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కోల రాజు నాయక్, మీస రవి, కాసు మహేందర్ రాజు, వై. భాను ప్రకాష్, వై. రవికుమార్, రఘు కుమార్, కిరణ్ జ్యోతి తదితరులతో పాటు పలువురు ఎన్నికయ్యరు. ఈ సందర్భంగా కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి మాట్లాడారు. టీచర్ల సంక్షేమం, ప్రమోషన్లు, విద్యాభివృద్ధే తమ ఫస్ట్ ప్రయార్టీ అని పేర్కొన్నారు.