- ఇల్లందు డీఎస్పీ చంద్రభాను వెల్లడి
టేకులపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడగా.. ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం మీడియా సమావేశంలో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను వివరాలు తెలిపారు.
టేకులపల్లి పోలీసులు సాయన్నపేట వద్ద శనివారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కారును ఆపేందుకు యత్నించగా.. తప్పించుకునేందుకు వేగంగా వెళ్తూ చెట్టును ఢీకొట్టాడు. పోలీసులు వెళ్లి కారులో తనిఖీలు చేయగా 199.673 కేజీల గంజాయి లభించగా.. విలువ రూ. 99.83 లక్షల ఉంటుంది.
నిందితుడు లాల్ సింగ్ చౌహాన్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయితో పాటు కారు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ ఐలు రాజేందర్, శ్రీనివాసరెడ్డి, సిబ్బంది ఉన్నారు.
