మున్సిపల్ ఎలక్షన్స్..ఫైనల్ ఓటర్ల లిస్ట్ రిలీజ్..మహిళా ఓటర్లే ఎక్కువ

మున్సిపల్ ఎలక్షన్స్..ఫైనల్ ఓటర్ల లిస్ట్ రిలీజ్..మహిళా ఓటర్లే ఎక్కువ

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు  జరుగనున్న క్రమంలో  మున్సిపల్ఓటర్ల ఫైనల్ లిస్ట్ ను  ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో 2వేల 996 వార్డుల్లో 52లక్షల 43 వేల మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చింది. ఇందులో  పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. 

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో 177 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్లు, మున్సిపాలిటిల్లో త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ క్రమంలో   ఈ మున్సిపాలిటీల్లోని 2వేల 996 వార్డుల్లో ఓటర్లను లిస్ట్ ను ఫైనల్ చేసి విడుదల చేసి  ఎస్ ఈసీ. 

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో మొత్తం 52లక్షల 43వేల మంది ఓటర్లుండగా.. వారిలో 25లక్షల 62 వేల మంది పురుషులు, 26లక్షల 80 వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక అత్యధిక ఓటర్లున్న మున్సిపల్ కార్పొరేషన్లను  కూడా  ప్రకటించింది ఎస్ఈ సీ. 3లక్షల 56 వేల ఓటర్లతో నిజామాబాద్ మున్సిపాలిటీ మొదటి స్థానంలో ఉంది. 3లక్షల 80వేల 560 మంది ఓటర్లతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రెండో స్థానంలో ఉందని ఎసీఈసీ తెలిపింది.