హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతోన్న ఐటీ సోదాలు

హైదరాబాద్ లో రెండో రోజు కొనసాగుతోన్న ఐటీ సోదాలు

హైదరాబాద్ లో రెండోరోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, బిగ్ సీ, లాట్ మొబైల్ షోరూమ్స్ లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు . రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు, వార్షిక ఆదాయ లెక్కలపై ఆరా తీస్తున్నారు. లాభాల్లో ఉన్న కంపెనీలను నష్టాల్లో చూపించి.. నిధులను వేరే సంస్థల్లోకి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారుల దగ్గర కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక సంస్థ ద్వారా హానర్ రియల్ ఎస్టేట్ లో ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు.

ఇక నిన్న హైదరాబాద్ లోని అమీర్ పేట, పంజాగుట్ట, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, సనత్ నగర్ వంటి 15 ప్రాంతాల్లో 20 టీమ్స్ సోదాలు చేశాయి. ఈ తనిఖీల్లో స్టాక్, గత నెల రోజుల్లో జరిగిన అమ్మకాల వివరాలను రికార్డ్ చేశాయి. ట్యాక్స్ చెల్లింపులు, నగదు లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించాయి. సోదాల టైమ్ లో ఆయా సంస్థల  సిబ్బందిని అధికారులు అనుమతించలేదు.