సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ

సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ

రెండో రోజు నీలం మధు పాదయాత్ర

పటాన్​చెరు, వెలుగు : బీఆర్‌‌ఎస్​కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన  ఎన్ఎంఆర్​ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధుకు  ప్రజలనుంచి ఆదరణ లభిస్తోంది. నియోజకవర్గంలో మంగళవారం రెండోరోజు పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా గుమ్మడిదల, కానుకుంట, మొల్లగూడెం, వీరారెడ్డి పల్లి, రామిరెడ్డి బావి, అనంతారం గ్రామాల్లో గడపగడపకు తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతాలు పలుకుతూ ఇంటి మనిషిలాగా ఆదరించారు.

స్థానిక సమస్యలపై ప్రజలు మధుతో మొరపెట్టుకుంటున్నారు.  స్పందించిన మధు ఏడాదిలో 365 రోజులు ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 'గుడ్​ మార్నింగ్​ పటాన్​చెరు' పేరుతో మీలో ఒకడిగా ఉంటానని హామినిచ్చారు.  ఆయన వెంట ఎన్​ఎంఆర్​ యువసేన అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.