శ్రీమురళి, రుక్మిణి వసంత్ జంటగా డాక్టర్ సూరి రూపొందించిన చిత్రం ‘బఘీర’. దర్శకుడు ప్రశాంత్ నీల్ కథను అందించగా, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇప్పటికే ఫస్ట్ సాంగ్‌తో ఇంప్రెస్ చేసిన టీమ్.. తాజాగా రెండో పాటను విడుదల చేసింది. ‘పరిచయమేలే.. పరిచయమేలే.. నిజముగా మారే కలలే.. పరవశమేలే.. పరవశమేలే.. హృదయంలో తొలి పదనిసలే..’ అంటూ సాగిన పాటలో శ్రీమురళి, రుక్మిణి వసంత్‌ల పాత్రలను పరిచయం చేస్తూ, వారి మధ్య ప్రేమకథని చూపించారు.
బి అజనీష్ లోక్‌నాథ్ సాంగ్ కంపోజ్ చేయగా, రాంబాబు గోసాల లిరిక్స్ రాశాడు. రితేష్ జి రావు పాడాడు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ ద్వారా ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అవుతోంది. ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ ఇతర పాత్రలు పోషించారు.
