- నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల అధికారులు
- 4,333 సర్పంచ్, 38,350 వార్డు స్థానాలకు ఎలక్షన్స్
- 2 వరకు నామినేషన్ల స్వీకరణ..5న ఉపసంహరణకు చాన్స్
- 14న పోలింగ్.. అదేరోజు రిజల్ట్
హైదరాబాద్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం రిటర్నింగ్ ఆఫీసర్లు జిల్లాలవారీగా నోటిఫికేషన్ జారీ చేశారు. రెండో విడతలో 193 మండలాల్లోని 4,333 సర్పంచ్, 38,350 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అయితే, కొన్ని జిల్లాల నుంచి వివరాలు రాకపోవడంతో నామినేషన్ల సంఖ్యపై ఇంకా క్లారిటీ రాలేదు. నేడు నామినేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
3న పరిశీలన, వీటిపై వినతులకు 4 వరకు అవకాశం ఉంటుంది. 5న నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. ఈ నెల 14న రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. అదేరోజు ఓట్లను లెక్కించి, విజేతను ప్రకటించనున్నారు.
