- డిసెంబర్ తో ఫైనాన్స్డైరెక్టర్ గా ఏడేండ్లు, సీఎండీగా రెండేండ్లు పూర్తి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్కంపెనీ సీఎండీ ఎన్ . బలరామ్‌కు
ఎక్స్టెన్షన్ ఆందోళనపట్టుకుంది. ఐఆర్ఎస్అధికారి బలరాం సింగరేణి ఫైనాన్స్డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి, డిసెంబర్ 5 నాటికి ఏడేండ్లు, సీఎండీగా 31తో రెండేండ్లు పూర్తి అవుతాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎక్స్టెన్షన్ రాకపోతే సీఎండీగా కొనసాగడంపై సందిగ్దత నెలకొంటుంది.
సింగరేణికి డిప్యూటేషన్‌పై రావడానికి ముందు బలరాం సెంట్రల్బోర్డ్ఆఫ్ఇన్డైరెక్ట్యాక్సెస్అండ్ కస్టమ్స్(సీబీఐసీ) ఆఫీసర్‌గా పని చేశారు. 2018 డిసెంబర్5న రెండేండ్ల వ్యవధితో ఆయన డిప్యూటేషన్‌పై సింగరేణికి వచ్చారు. ఇప్పటిదాకా ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతుండగా.. అదనంగా పలు విభాగాల బాధ్యతలను నిర్వహించారు.
2024లో సీఎండీ శ్రీధర్బదిలీ కాగా, పూర్తి అదనపు బాధ్యతలతో సీఎండీ అయ్యారు. ఫైనాన్స్డైరెక్టర్గా ఉన్న వారెవరూ రెండేండ్ల పాటు సింగరేణి సీఎండీగా కొనసాగలేదు. 40వేల కోట్ల టర్నోవర్ఉన్న సంస్థలో ఏడేండ్లుగా పని చేస్తున్న బలరాంకు ఎనిమిదో ఏట కూడా కొనసాగేందుకు ఎక్స్టెన్షన్ వస్తుందా..? అనేది ఇప్పుడు కంపెనీలో చర్చనీయాంశమైంది.
