- ఉమ్మడి జిల్లాలో రెండో విడత సర్పంచ్ స్థానాలు 418
- వార్డు మెంబర్ స్థానాలు 3,764
- 604 నామినేషన్లు దాఖలు
జగిత్యాల, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత సర్పంచ్, వార్డు మెంబర్స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకున్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కలిపి తొలిరోజు మొత్తం 418 సర్పంచ్ స్థానాలకు గానూ 487 నామినేషన్లు దాఖలయ్యాయి.
కరీంనగర్ జిల్లాలో 113..
జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మొదటి రోజు మొత్తం 113 సర్పంచ్ స్థానాలకు 121 నామినేషన్లు వచ్చాయి. చిగురుమామిడి మండలంలోని 17 జీపీలకు 16, గన్నేరువరం మండలంలోని 17 జీపీలకు 10, మనకొండూర్ మండలంలోని 29 జీపీలకు 30, శంకరపట్నం మండలంలోని 27 జీపీలకు 35, తిమ్మాపూర్ మండలంలోని 23 జీపీలకు 30 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 1,046 వార్డులకు 209 మంది నామినేషన్వేశారు.
జగిత్యాల జిల్లాలో 144..
జిల్లాలోని 144 సర్పంచ్స్థానాలకు 171 నామినేషన్లు వచ్చాయి. బీర్పూర్ మండలంలోని 17 జీపీలకు 17, జగిత్యాల మండలంలోని 5 జీపీలకు 9, జగిత్యాల రూరల్ మండలంలోని 29 జీపీలకు 36, కొడిమ్యాల మండలంలోని 24 జీపీలకు 33, మల్యాల మండలంలోని 19 జీపీలకు 19, రాయికల్ మండలంలోని 32 జీపీలకు 39, సారంగాపూర్ మండలంలోని 18 జీపీలకు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 1,276 వార్డులకు 238 మంది నామినేషన్వేశారు.
పెద్దపల్లి జిల్లాలో 73..
జిల్లాలో మొత్తం 73 సర్పంచ్స్థానాలకు తొలిరోజు 97 నామినేషన్లు వచ్చాయి. అంతర్గాం మండలంలోని 15 జీపీలకు 12, జూలపల్లి మండలంలోని 13 జీపీలకు 22, పాలకుర్తి మండలంలోని 16 జీపీలకు 32, ధర్మారం మండలంలోని 29 జీపీలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 684 వార్డులకు 41 మంది నామినేషన్వేశారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 88..
జిల్లాలోని మొత్తం 88 సర్పంచ్స్థానాలకు 98 నామినేషన్లు వచ్చాయి. తంగళ్లపల్లి మండలంలోని 30 జీపీలకు 26, బోయినిపల్లి మండలంలోని 23 జీపీలకు 36, ఇల్లంతకుంట మండలంలోని 35 జీపీలకు 36 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 758 వార్డులకు 116 మంది నామినేషన్వేశారు.
