కోల్ఇండియా కబడ్డీ విజేత డబ్ల్యూసీఎల్..26వ సారి విజేతగా నిలిచి రికార్డు

కోల్ఇండియా  కబడ్డీ విజేత డబ్ల్యూసీఎల్..26వ సారి విజేతగా నిలిచి రికార్డు
  •     రన్నరప్​గా సింగరేణి జట్టు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కోల్​ ఇండియా స్థాయి కబడ్డీ పోటీల్లో వెస్ట్రన్​కోల్​ఫీల్డ్​ (డబ్ల్యుసీఎల్​) కబడ్డీ జట్టు రికార్డు సృష్టించింది. 26వ సారి విజేతగా నిలిచి తన రికార్డును నిలబెట్టుకుంది.  కొత్తగూడెం ఏరియాలో ఆదివారం సింగరేణి జట్టుతో జరిగిన ఫైనల్​మ్యాచ్​లో డబ్ల్యుసీఎల్​విజయం సాధించింది.  మూడు రోజులుగా జరిగిన కబడ్డీ పోటీలు ఆదివారం ముగియగా.. సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్లు ఎం. తిరుమల రావు, ఎల్వీ సూర్యనారాయణ విజేతలకు బహుమతులు అందించారు. 

రన్నరప్​గా సింగరేణి జట్టు నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రోగ్రామ్ లో ఏరియా జీఎం షాలెం రాజు, గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్​వర్కర్స్​యూనియన్​అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్​టీయూసీ సీనియర్​వైస్​ ప్రెసిడెంట్​త్యాగరాజన్, సీఎంఓఏఐ ఏరియా ప్రెసిడెంట్ ఎంవీ నర్సింహరావు, జీఎంలు జీవీ కిరణ్​కుమార్, ఎం. సుబ్బారావు, ఎస్వోటూజీఎం జీవీ కోటిరెడ్డి, యూనియన్ నేతలు మల్లికార్జున్, రజాక్​ తదితరులు పాల్గొన్నారు.