ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ లో 37 మంది మావోయిస్టులు లొంగుబాటు

ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ లో  37 మంది మావోయిస్టులు లొంగుబాటు

భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్‌‌‌‌ పార్టీకి చెందిన 37 మంది ఆదివారం ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని దంతెవాడ ఎస్పీ గౌరవ్‌‌‌‌రాయ్‌‌‌‌ ఎదుట లొంగిపోయారు. వీరిలో పది మంది మిలీషియా సభ్యులు కాగా, 12 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో  27 మందిపై రూ.65 లక్షల రివార్డు ఉంది. 

గోంపడ్,  జంగంపాల్, గద్రూమ్‌‌‌‌ పరిసర ప్రాంతాల్లోని డివిజనల్, ఏరియా కమిటీ మెంబర్లతో పాటు స్పెషల్‌‌‌‌ జోనల్‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌ కమలేశ్‌‌‌‌కు గార్డుగా వ్యవహరించిన మావోయిస్టుతో పాటు కుమలి అలియాస్‌‌‌‌ అనితా మండవి, గీత అలియాస్‌‌‌‌ లక్ష్మీ మండవి, రంజన్‌‌‌‌ అలియాస్‌‌‌‌ సోమా మండవి, భీమా అలియాస్‌‌‌‌ జహాజ్‌‌‌‌ కల్ము వంటి మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణసాయం కింద ఒక్కొక్కరికి రూ.50 వేలను అందజేశారు.