ముగిసిన రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ

ముగిసిన రెండో విడత  నామినేషన్ల  ఉపసంహరణ
  • ఎంతమంది బరిలో నిలిచారనే దానిపై నేడు క్లారిటీ

హైదరాబాద్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్త కాగా.. శనివారం నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసింది. ఈ విడతలో ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి? ఎంతమంది బరిలో నిలిచారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. 

అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయిస్తున్నారు. రెండో విడతలో మొత్తం 4,332  సర్పంచ్ స్థానాలకు 28,278 నామినేషన్లు దాఖలు కాగా.. 38,342 వార్డులకు 93,595 నామినేషన్లు వచ్చాయి. 14న పోలింగ్ నిర్వహించి.. అదేరోజు విజేతలను ప్రకటిస్తారు.