దేశ వ్యాప్తంగా మరోసారి పీఎఫ్ఐపై ఎన్ఐఏ సోదాలు

దేశ వ్యాప్తంగా మరోసారి పీఎఫ్ఐపై ఎన్ఐఏ సోదాలు

పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియాపై దర్యాప్తు సంస్థలు రెండో విడత దాడులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలల్లో పీఎఫ్ఐ సంస్థలు, ఆ సంస్థ సభ్యుల నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు...  వారి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కొందరు పీఎఫ్ఐ సభ్యులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, మేఘాలయ, పలు రాష్ట్రాలలోనూ వారి సోదరుల ఇళ్లల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా  కర్నాటకలోని భగల్‌కోట్‌లో ఏడుగురు పీఎఫ్ఐ కార్యకర్తలు సహా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45 మందిని అరెస్టు చేశారు. అసోంలో రాష్ట్ర పోలీసులు దాడులు జరిపి 17 పీఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేశారు. 

మహారాష్ట్రలో ఏటీఎస్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో భాగంగా ఔరంగాబాద్, నాందేడ్, షోలాపూర్, జాల్నా, పర్భానీలలో పీఎఫ్‌ఐ సంబంధిత ప్రదేశాలపై దాడులు నిర్వహించారు. అనంతరం ఠాణే క్రైం బ్రాంచ్ పోలీసులు నలుగురు పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేశారు. ముంబ్రాలో ఇద్దరిని, కళ్యాణ్‌లో ఒకరు, భివాండీలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ స్టేట్ మౌలానా ఇర్ఫాన్ డోలక్ నద్వి ని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ లో పలు జిల్లాల్లో 21 మందిని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్, షాహిన్బాగ్ లోని పలు ప్రాంతాలలో సోదాలు నిర్వహించిన అధికారులు.. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్ చేశారు. మొదటి రౌండ్ దాడులలో అరెస్టయిన పీఎఫ్‌ఐ నేతల నుంచి రాబట్టిన సమాచారంతో రెండో విడద దాడులకు ప్లాన్ చేశారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు 250 మందికి పైగా అరెస్టయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 12న ఎన్‌ఐఏ, ఈడీ పీఎఫ్‌ఐపై అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు.15 రాష్ట్రాల్లోని 93 చోట్ల తనిఖీలు నిర్వహించి దాదాపు 100 మందిని అరెస్టు చేశారు.