తెలుగు టైటాన్స్‌‌‌‌కు రెండో విజయం

తెలుగు టైటాన్స్‌‌‌‌కు రెండో విజయం

విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌ 12వ సీజన్‌‌‌‌లో  తెలుగు టైటాన్స్‌‌‌‌ జోరు కొనసాగుతుంది. సొంతగడ్డపై ఆ జట్టు వరుసగా రెండో విక్టరీ సొంతం చేసుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 07) రాత్రి  విశాఖపట్నంలోని రాజీవ్‌‌‌‌గాంధీ ఇండోర్‌‌‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌‌‌లో టైటాన్స్ 44–-34తో మాజీ చాంపియన్‌‌‌‌ బెంగాల్‌‌‌‌ వారియర్స్‌‌‌‌పై ఘన విజయం సాధించింది. 

ఈ పోరులో టైటాన్స్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతోతో అదరగొట్టింది. కెప్టెన్‌‌‌‌, ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ విజయ్‌‌‌‌ మాలిక్‌‌‌‌ (11 పాయింట్లు), భరత్‌‌‌‌ (12 పాయింట్లు) సూపర్‌‌‌‌ టెన్స్‌‌‌‌తో టీమ్‌‌‌‌ను ముందుండి గెలిపించారు. ఫస్టాఫ్‌‌‌‌లో 23-–14తో ఆధిక్యంలో నిలిచిన తెలుగు జట్టు బ్రేక్ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. 

బెంగాల్‌‌‌‌  తరఫున స్టార్ రైడర్ దేవాంక్‌‌‌‌ దలాల్ (13 పాయింట్లు) సూపర్ టెన్‌‌‌‌తో మెప్పించినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో  టైటాన్స్‌‌‌‌ పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేస్‌‌‌‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌‌‌‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ 36–35తో  జైపూర్ పింక్ పాంథర్స్‌‌‌‌పై ఒక్క పాయింట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.