
సెక్రటేరియెట్లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సెక్రటేరియెట్ ఉద్యోగుల సంఘం, నల్లపోచమ్మ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉత్సవాలు నిర్వహించారు. నార్త్ గేట్ నుంచి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు, భారీ తొట్టెను సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, కళాకారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.