క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కోసం సింపుల్ టిప్స్

క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కోసం సింపుల్ టిప్స్

క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో మెయిన్ అట్రాక్షన్ క్రిస్మస్ ట్రీనే. ఆ ట్రీ డెకరేషన్ కోసం కొన్ని టిప్స్.

  • ఆర్టిఫీషియల్, ఒరిజినల్ చెట్టు ఏదైనా సరే డెకరేషన్ లైటింగ్ నుంచే మొదలుపెట్టాలి. ఎందుకంటే.. గార్లాండ్స్ లాంటివి ముందు పెట్టేస్తే తరువాత లైట్స్ పెట్టడం కష్టమవుతుంది. అలాగే రెండు అడుగుల ఎత్తున్న క్రిస్మస్ చెట్టుకి దాదాపు వంద బల్బ్ లు లేదా 5 మీటర్ల లైట్లతో డెకరేట్ చేయాలి. ఒకవేళ ఆరు అడుగుల ట్రీ అయితే 300 బలు లేదా 15 మీటర్ల లైట్లు కావాలి. ఇలా చెట్టు ఎత్తుని బట్టి బల్బ్ లు, లైట్లు తీసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది.
  • సీజన్ ఎలిమెంట్స్ ని కూడా క్రిస్మస్ ట్రీ డెకరేషన్లో యాడ్ చేయొచ్చు. పర్ఫెక్ట్ వింటర్ లుక్ ఇచ్చే ఐసికల్ ఆర్నమెంట్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. వాటిని వేలాడదీస్తే చెట్టు అందం రెట్టింపు అవుతుంది. అలాగే స్నో ప్లేక్స్ ఆర్నమెంట్స్ కూడా యునిక్ లుక్ ఇస్తాయి. వాటిల్లోనూ వైట్ స్నోఫ్లేక్స్ ని ఎంచుకుంటే.. అవి లైట్స్ వెలుతురుకి మెరుస్తాయి. కావాలనుకుంటే చిన్నచిన్న స్నో మ్యాన్ బొమ్మల్ని కూడా క్రిస్మస్ ట్రీకి వేలాడదీయొచ్చు. స్నో బాల్స్ కూడా వాడొచ్చు. ఖర్చు ఎందుకు అనుకుంటే దూదిని స్నోబాల్స్ లా డెకరేట్ చేయొచ్చు.
  • క్రిస్మస్ట్రీకి బకెట్ బాల్స్ మరింత ఇస్తాయి. అవి కూడా రంగు రంగుల్లో ఎంచుకుంటే లుక్ బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ, గోల్డెన్ కలర్ బకెట్ బాల్స్ చెట్టుకి మంచి లుక్ ఇస్తాయి. అలాగే క్రిస్మస్ ట్రీకి బెల్స్ మరో అట్రాక్షన్.
  • రిబ్బన్స్ లేని క్రిస్మస్ ట్రీని ఊహించడం కష్టమే. అయితే నార్మల్ రిబ్బన్స్ బదులు ఈసారి రెడ్ వెల్వెట్ రిబ్బన్లు ట్రై చేయొచ్చు. గ్రాండ్ డెకరేషన్ కి బడ్జెట్ లేనివాళ్లు వీటిని చెట్టుకి అక్కడక్కడా వేలాడదీస్తే అందంగా ఉంటుంది. అలాగే క్రిస్మస్ ట్రీకి గ్రాండ్ లుక్ ఇవ్వాలంటే చెక్క డెకరేటివ్ పీస్లు బెస్ట్ ఆప్షన్. మినియేచర్ చెక్క బొమ్మలు, శాంటా క్లాజ్ లు చెట్టుకి వేలాడ దీయొచ్చు. మాకీ లెటర్ లైట్స్ కూడా సెలక్ట్ చేసుకోవచ్చు.