
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో సిటీలోని రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీసుల వద్ద 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. అభ్యర్థుల నామినేషన్లు, విత్ డ్రా ప్రక్రియ ముగిసే వరకు నవంబర్ 3 నుంచి 15వ తేదీ వరకు ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రేటర్ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీసుల వద్ద100 మీటర్ల దూరంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపుగా ఉండొద్దని సూచించారు.
రూల్ పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రంగారెడ్డి, మేడ్చల్,వికారాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు.