కమిషనరేట్​ పరిధిలో 144 సెక్షన్

కమిషనరేట్​ పరిధిలో 144 సెక్షన్

హనుమకొండ, వెలుగు : ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు

27న ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధమని, ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమిగూడరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.