
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్‌లో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆయనతో స్పీకర్ ప్రమాణం చేయించారు. శాసనసభ వ్యవహారాల మంత్రులు శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీగణేశ్కు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన నేపథ్యంలో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు.