కూల్చివేత పనులు సేఫ్గా కొనసాగుతున్నాయి: జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ జియఉద్దీన్

కూల్చివేత పనులు సేఫ్గా కొనసాగుతున్నాయి: జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ జియఉద్దీన్

ఇటీవల అగ్నిప్రమాదంలో కాలిపోయిన డెక్కన్ మాల్ కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగుతున్నాయని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ జియఉద్దీన్ తెలిపారు. ఇవాళ మీడియాతో ఆయన.. డెమాలిషన్ పనుల కొరకు మొదట్లో ఎస్ కే మల్లు కు టెండర్ ఇచ్చామని.. అయితే ఎస్ కే మల్లు వద్ద సరైన మిషినరీ లేదని ఒప్పందం కాన్సెల్ చేశామన్నారు. రెహ్మాన్ మాలిక్ ట్రేడింగ్ & డెమోలిషన్ కంపెనీకి మాల్ కూల్చివేతే పనులు అప్పగించామని ఆయన స్పష్టం చేశారు. మాలిక్ సంస్థ వద్ద సరైన మిషనరీ ఉందన్నారు. భవనం లోపలే కూల్చేవిధంగా డిమాలిషన్ జరుగుతుందని చెప్పారు. బిల్డింగ్ వ్యర్ధాల తొలగింపు మాత్రం ఓనర్ దే బాధ్యత అని అన్నారు. భవనం కూల్చివేత సేఫ్ గా జరిగేవిధంగా చూసుకోవడమే తమ బాధ్యత అని వెల్లడించారు. నాలుగు రోజుల్లో భవనం కూల్చివేత ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని జియఉద్దీన్ పేర్కొన్నారు.

కాగా, నిన్న రాత్రి 11 గంటలకు బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభించారు. భారీ క్రేన్ సాయంతో కూల్చివేత పనులను చేపట్టారు. బిల్డింగ్ ముందు భాగం నుండి ఒక్కొక్క ఫ్లోర్ గోడ కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. పక్క బిల్డింగులకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా పనులు చేపట్టారు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ కూల్చివేత సమయంలో గోడల నుండి పొగలు రావడంతో పనులు కొంతసేపు నిలిచిపోయాయి. తరువాత కూల్చివేత పనులను మళ్లీ మొదలుపెట్టారు. బిల్డింగ్ ను కూల్చివేస్తున్న సందర్భంగా దాదాపు 5 రోజుల పాటు రెండు వైపుల రోడ్డును మూసివేశారు.  డెక్కన్ మాల్ బిల్డింగ్ పరిసర ప్రాంతంలోకి ఎవరూ రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.