మహంకాళి ఆలయ పరిసరాల పరిశీలన

మహంకాళి ఆలయ పరిసరాల పరిశీలన

సికింద్రాబాద్, వెలుగు : వచ్చే నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్​ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహంకాళి ఏసీపీ సర్దార్​సింగ్, ఇన్​స్పెక్టర్ పరశురాం, ట్రాఫిక్​ఇన్​స్పెక్టర్​ఉమాశంకర్​సోమవారం ఆలయ పరిసరాలను పరిశీలించారు.

క్యూలైన్ల వివరాలను ఆలయ ఈఓను అడిగి తెలుసుకున్నారు. బోనాల ఉత్సవాలను అందరి సహకారంతో విజయవంతం చేస్తామని తెలిపారు.