సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఘనంగా మహర్నవమి వేడుకలు.. మహిషాసుర మర్దినిగా అమ్మవారు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో  ఘనంగా మహర్నవమి వేడుకలు.. మహిషాసుర మర్దినిగా అమ్మవారు

పద్మారావునగర్​: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బుధవారం మహానవమి సందర్భంగా చండీ, పూర్ణాహుతి హోమాలు నిర్వహించారు. పూర్ణాహుతి హోమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. పదో రోజు బుధవారం అమ్మవారు మహిషాసుర మర్దిని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. 

బల్కంపేటకు ప్రముఖుల తాకిడి..

బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానంలో పదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ గవర్నర్​ బండారు దత్తాత్రేయ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్​, తెలంగాణ స్పోర్ట్స్​ అథారిటీ చైర్మన్​ కె.శివసేనారెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్​ రెడ్డి అమ్మవారికి పూజలు చేశారు.