వైఎంసీఏలో సెమీ క్రిస్మస్ వేడుకలు

వైఎంసీఏలో సెమీ క్రిస్మస్ వేడుకలు

పద్మారావునగర్​, వెలుగు: సికింద్రాబాద్‌‌ వైఎంసీఏలో ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులు, ఎంఎస్ఎం, సీఎస్​డబ్ల్యూ సభ్యులు కలిసి సోమవారం సెమీ క్రిస్మస్‌‌ వేడుకలు జరుపుకున్నారు. ఐ నీడ్​ హెల్ప్​ ఎన్జీవో ట్రస్టీ జాకబ్‌‌ చిన్నప్ప ఆధ్వర్యంలో వైఎంసీఏ సికింద్రాబాద్‌‌, యూపీఎఫ్​ హైదరాబాద్‌‌ సహకారంతో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జాయ్‌‌ చెరియన్‌‌,  విద్యావేత్త శ్రావంతి, రిటైర్డ్​ అడిషనల్​ డీజీపీ బాబురావు, వైఎంసీఏ గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ అధ్యక్షుడు జయాకర్‌‌ డేనియల్‌‌, సికింద్రాబాద్‌‌ ప్రధాన కార్యదర్శి లియోనార్డ్‌‌  పాల్గొన్నారు.