V6 News

RCB హోంగ్రౌండ్లో భద్రతా లోపం.. సీసీటీవీ కెమెరాల ధ్వంసం.. ఇద్దరు అరెస్ట్!

RCB హోంగ్రౌండ్లో భద్రతా లోపం.. సీసీటీవీ కెమెరాల ధ్వంసం.. ఇద్దరు అరెస్ట్!

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరోసారి వార్తల్లోకెక్కింది. 18 ఏళ్ల తర్వాత గతేడాని ఆర్సీబీ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. ఆ ఘటన ఇంకా మర్చిపోక ముందే మరో వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రౌండ్ లో దాదాపు 240 కెమెరాల ఫీడ్‌ను ఇద్దరు ఉద్యోగులు ఆపేశారు. అత్యంత కట్టుదిదట్టమైన భద్రత మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి.. ఇప్పుడు మైదానంలోనే భద్రతకు సంబంధించి వార్త బయటకు రావడం కలకలం రేపుతుంది. 

సీసీటీవీలను పర్యవేక్షించే సబ్ కాంట్రాక్ట్ కంపెనీకి చెందిన మంజునాథ్, అబ్దుల్ కలామ్ అనే ఉద్యోగులు ఇద్దరు డీయాక్టివేట్ చేసే యాక్సిస్ కార్డును ఉపయోగించి పర్మిషన్ లేకుండా కంట్రోల్ రూమ్‌లోకి ప్రవేశించి సీసీటీవీ ఫైబర్ కనెక్షన్లు, వీడియో రికార్డర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు స్పందించి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను రెడీ చేశారు. సీసీటీవీ కెమెరాలకు సంబంధించి బ్యాకప్ సాయంతో సాధారణ పరిస్థితికి తెచ్చారు. రియల్ టైమ్ మానిటరింగ్‌ను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. కానీ రూ.10 లక్షల బకాయిలు తమకు రావాల్సి ఉండటంతో, వాటిని చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేయడంతోనే ఇలా చేసినట్లు ఇద్దరు ఉద్యోగులు పోలీసుల విచారణలో తెలియజేశారు. 

ALSO READ | ఉబెర్‌‌‌‌ కప్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌ టోర్నీ.. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌కు అమ్మాయిల చెక్‌‌‌‌

కాగా ఏప్రిల్ 24వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ తర్వాత కీలక ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫీడ్ నిలిపివేయడంతో పాటు కంట్రోల్ రూమ్ లోని సీసీటీవీలని ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. స్టేడియంలోని కీలక ప్రాంతాలను కవర్ చేసే సీసీటీవీల కనెక్షన్లు తొలగించినందుకు.. ఆ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపపట్టినట్లు కబ్బన్ పార్క్ పోలీసులు తెలిపారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో భద్రతకు సంబంధించి ఉల్లంఘన జరగడం ఇదే తొలి సారి కాదు.. ఐపీఎల్ ప్రారంభమైన కొద్ది రోజులకే బ్లాక్ టికెట్ల దందాను బెంగళూరు పోలీసులు ఛేదించారు.