హార్సెన్స్: ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియా విమెన్స్ టీమ్ పుంజుకుంది. శనివారం రాత్రి జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో 4–1తో ఉక్రెయిన్‌ను చిత్తు చేసి క్వార్టర్స్ రేసులో నిలిచింది. మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్ గెలిచి జట్టు విజయం ఖాయం చేశారు. ఫస్ట్ డబుల్స్‌లో కవిప్రియ–సిమ్రన్ ఓడినా.. చివరి డబుల్స్ మ్యాచ్‌లో సింధు–తనీషా క్రాస్టో 21–18, 21–15తో స్టోలియరెంకో–లావ్రోవాపై నెగ్గారు. సోమవారం జరిగే గ్రూప్ చివరి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చైనాతో ఇండియా తలపడనుంది.

